‘వెంకటేశుని’ కరుణా కటాక్షాలతోనే.. | - | Sakshi
Sakshi News home page

‘వెంకటేశుని’ కరుణా కటాక్షాలతోనే..

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

‘వెంకటేశుని’ కరుణా కటాక్షాలతోనే..

‘వెంకటేశుని’ కరుణా కటాక్షాలతోనే..

చర్చకు దారి తీసిన

‘సాక్షి’ కథనం..

అధికారికి ముడుపులిస్తేనే

అక్రమ రవాణా

ఇసుక, మైనింగ్‌ మాఫియాతో ములాఖత్‌

భద్రాచలం రెవెన్యూ కార్యాలయానికి అవినీతి మరకలు

‘పైసలిస్తేనే..పత్రాలు’పై సర్వత్రా చర్చ

భద్రాచలం: భద్రాచలం మండల రెవెన్యూ అధికా రుల కనుసన్నల్లోనే ఇసుక, గ్రావెల్‌, మైనింగ్‌ అక్ర మ రవాణా జోరుగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్నే జీవనాధారంగా చేసుకున్న అక్రమార్కులు మండల అఽధికారులను మచ్చిక చేసుకొని ఇష్టారాజ్యంగా రవాణా చేస్తున్నారు. ఓ అధికారి రోజు, నెలవారీ మామూళ్లతో అక్రమార్కులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి నట్టు సమాచారం. ఈ అండదండలతోనే రాత్రి వేళల్లో ప్రధాన కాలనీల నుంచి ఇసుక రవాణా చేయడమే కాక అక్కడ నిల్వ చేసి ట్రాక్టర్‌లు, లారీల ద్వారా వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. రెండు రోజుల కిత్రం పట్టపగలే ఉదయ్‌ భాస్కర్‌ రోడ్డులో ప్రదాన రోడ్డుపై లారీ టిప్పర్‌తో ఇసుక తీసుకెళ్తుండగా భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. దీనిపై అధికారులకు ఫిర్యా దు చేసినా ఫలితం లేదు. అయితే ‘వెంకటేశుని’ కరుణా కటాక్షాలు మెండుగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కింది స్థాయి ఉద్యోగులతోనే బేరసారాలు..

భద్రాచలం రెవెన్యూ కార్యాలయంలో అడుగుపెట్టాలంటేనే దరఖాస్తుదారులు బెంబేలెత్తుతున్నా రు. కల్యాణలక్ష్మి పథకం కోసం కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయామని కొందరు చెబుతున్నారు. అన్ని అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకుని మూడు నెలలు గడిచినా అప్రూవల్‌ చేయలేదని బాధితులు వాపోతున్నారు. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సదరు కార్యాలయ ఉన్నతాధికారి కిందిస్థాయి ఉద్యోగులతోనే బేరసారాలు చేయిస్తున్నట్లు తెలు స్తోంది. అక్కడ పనిచేసే ఇద్దరు ఉద్యోగులతో పాటు బయట ఓ మధ్యవర్తిని సంప్రదిస్తే ఈ కార్యాలయంలో ఏ పనైనా ఇట్టే పూర్తవుతుందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓమరణ ధ్రువీకరణ పత్రం జారీకి రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. మరో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ద్వారా జనన ధ్రువీకరణ, ఇతర పత్రాలకు అడ్డగోలు దందాలకు పాల్ప డుతున్నట్లు తెలిసింది.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే..

రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే భద్రాచలం మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పేరుకుపోతోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు కొలువై ఉన్న భద్రాచలం డివిజన్‌ కేంద్రంలో దరఖాస్తుదారులు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నా కనీసచర్యలు చేపట్టకపోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అవినీ తిని సైతం సదరు మండలస్థాయి అధికారి సమర్ధించుకోవడం విశేషం. భద్రాచలం వచ్చే వీఐపీల ప్రొటోకాల్‌కు భారీగా ఖర్చవుతుందని, అందుకే కొద్ది మేర తీసుకుంటున్నామని అంతర్గతంగా కొందరితో చెప్పినట్లు తెలిసింది.

భద్రాచలం తహసీల్దార్‌ కార్యాలయంలో జరగుతున్న అవినీతిపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ‘పైసలిస్తేనే పత్రాలు’ కథనం తీవ్ర చర్చకు దారి తీసింది. సోషల్‌ మీడియాలో సైతం ఈ క్లిపింగ్‌ వైరల్‌ అయింది. మరి కొంతమంది బాధితులు ఫోన్‌లో తమ గోడు వెల్లబుచ్చారు. అవినీతి నిరోధకశాఖ అధికారులను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement