● ఆం బజార్.. కేరాఫ్‘చౌక్’లు..
ఇల్లెందు: ఇల్లెందులో ఆం బజార్ అంటేనే వ్యాపార కూడలి. అక్కడి పలు ప్రధాన సెంటర్లకు జాతీయోద్యమ నేతల పేర్లు ఉండగా అవన్నీ ప్రసిద్ధి చెందాయి. ఒక్క ఆం బజార్‌లోనే మూడు ప్రధాన కూడళ్లకు నెహ్రూ చౌక్, పటేల్ చౌక్, గాంధీచౌక్‌గా పేర్లు ఉన్నాయి. ఆయా బజార్లలో విగ్రహాలతోపాటు ఆ ప్రాంతాలను(ల్యాండ్ మార్క్) జాతీయోద్యమ నేతల పేర్లతో ‘చౌక్’లుగా పిలుస్తున్నారు. జాతీయ నేతల జయంతి, వర్ధంతి రోజున అక్కడి విగ్రహాలకు పూలమాలలు వేసి స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇల్లెందుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు ప్రతిష్టించిన విగ్రహాలు, వాటి సెంటర్లు సజీవంగా నిలుస్తున్నాయి. ఇవికాక ఎల్‌బీఎస్ నగర్‌లో లాల్‌బహుదూర్‌శాస్త్రి విగ్రహం, మార్కెట్‌లో సుభాష్‌చంద్ర బోస్ విగ్రహం, ఇందిరానగర్‌లో ఇందిరాగాంధీ విగ్రహం ఉన్నాయి.
జాతీయోద్యమ నేతల పేర్లతో సెంటర్లు


