● ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి | - | Sakshi
Sakshi News home page

● ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

● ప్రభుత్వ ఉద్యోగులకు        అనుమతి

● ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి

ఖమ్మంసహకారనగర్‌: మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్‌కు వెళ్లేలా అనుమతి మంజూరు చేయాలని ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు సంబంధిత శాఖాధికారులకు వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని తెలిపారు.

కలెక్టరేట్‌ నుంచి

పోలింగ్‌ పర్యవేక్షణ

ఖమ్మంసహకారనగర్‌: మున్సిపాలిటీల్లో పోలింగ్‌ను నిరంతరం పర్యవేక్షించేలా ఖమ్మం కలెక్టరేట్‌లో మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు వెబ్‌క్యాస్టింగ్‌ మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ అధికారి ఎ.పద్మశ్రీ మంగళవారం పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని 117 పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాటు చేయగా.. అక్కడి పోలింగ్‌ సరళి పరిశీలనకు కలెక్టరేట్‌లో ఐదు స్క్రీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా పర్యాటక అధికారి సుమన్‌ చక్రవర్తి, టెక్నికల్‌ మేనేజర్‌ హనుమాచారి, ఈడీఎం దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement