పరీక్షలంటే భయం వీడాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): పరీక్షలంటే భయపడొద్దని, మార్కులు సాధించడమే లక్ష్యం కాదని, జీవితంలో విజయం సాధించాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహాలకు చెందిన 200 మంది పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై ప్రేరణ, అవగాహన తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాటిల్, బీసీ సంక్షేమాధికారి పి.విజయలక్ష్మి మాట్లాడారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలకు కృషి చేయాలని కోరారు. మోటివేటర్ జువ్వాది వెంకటేశ్వరబాబు మాట్లాడుతూ.. వివిధ సబ్జెక్టులపై పట్టు సాధించడం, పరీక్షలకు సిద్ధం కావడంపై వివరించారు. కార్యక్రమంలో పి.అపర్ణ, కె.హనుమంతరావు, జి.వెంకటేశ్వర్లు, కె.రవి, ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్, దుర్గ, శ్రీదేవి, లావణ్య, అరుణ, భవ్య పాల్గొన్నారు.


