వంతెన నిర్మాణ పనుల పరిశీలన
చర్ల: మండలంలోని పూసుగుప్ప మార్గంలో రూ 4.50 కోట్ల అంచనా వ్యవయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం ఎస్పీ రోహిత్‌రాజ్ పరిశీలించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధి నిధులతో పూసుగుప్ప – వద్దిపేట గ్రామాల మధ్యలో దీనిని నిర్మిస్తుండగా పనులు నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట భద్రాచలం ఏఎస్‌పీ విక్రాంత్‌కుమార్‌సింగ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీఐ రాజువర్మ, ఎస్‌ఐలు కేశవ్, నర్సిరెడ్డి ఉన్నారు.
లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా 12న సమ్మె
మణుగూరు టౌన్: కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఈ నెల 12న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మాచారి కోరారు. శుక్రవారం వివిధ కాంట్రాక్ట్ కార్మికులను కలిసి సమ్మైపె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేబర్ కోడ్లలో అదనపు పనిగంటలకు ఓటీ విధానాన్ని రద్దు చేశారని, 50 మంది కంటే తక్కువ మంది కార్మికులు పనిచేసే కాంట్రాక్టర్ ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించారని తెలిపారు. దీని వల్ల కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధత లేకుండాపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం ఉద్యోగ భద్రత కోసం సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గద్దల శ్రీను, కొడిశాల రాములు, సత్రపల్లి సాంబశివరావు, సాయి సుమన్, ఇమాంత్ హతిరాం, భీమయ్య, శ్రీవాణి, గట్టమ్మ, అమృతరావు, శ్రీను ఉన్నారు.
వంతెన నిర్మాణ పనుల పరిశీలన


