తునికాకు సేకరణకు సిద్ధం
ఈ ఏడాది లక్ష్యం 36,100 స్టాండర్డ్ బ్యాగ్‌లు
పాల్వంచరూరల్: ఈ ఏడాది జిల్లాలో 35,100 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. ఖమ్మం డివిజన్‌తో కలిపితే ఇది 35,900 స్టాండర్డ్ బ్యాగులుగా ఉంది. పాల్వంచ డివిజన్ పరిధిలో 2300 స్టాండర్డ్ బ్యాగులు, కిన్నెరసాని అభయారణ్యం డివిజన్‌లో 3,200 స్టాండర్డ్ బ్యాగులు, కొత్తగూడెం డివిజన్ పరిధిలో 3,900, ఇల్లెందు డివిజన్ పరిధిలో 10,600, భద్రాచలం డివిజన్‌లో 9,700, మణుగూరు డివిజన్‌లో 5,400 స్టాండర్డ్ బ్యాగులు, ఖమ్మం డివిజన్‌లో 800 స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించనున్నారు. ఏటా ఏప్రిల్ చివరి వారం నుంచి తునికాకు సేకరణ మొదలుకానుండటంతో అధికారులు టెండర్లు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.


