పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం

Feb 8 2026 4:11 AM | Updated on Feb 8 2026 4:11 AM

పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం

పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం

చుంచుపల్లి: ెపరటి కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం సమాకూరుతుందని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోళ్ల పెంపకంతో కుటుంబ అవసరాలకు సరిపడా ఆదాయం లభించడంతో పాటు పోషక విలువలు గల ఆహా రం కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపా రు. లబ్ధిదారులు కోళ్లను సరైనసంరక్షణతో పెంచా లని సూచించారు. జిల్లా పశుసంవర్థక శాఖ అధి కారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపకంలో పాటించాల్సిన ప్రాథమిక అంశాలు, కోళ్లకు అందించాల్సినఆహారం, నివాస ఏర్పాట్లు, వ్యాధు ల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సీనియర్‌ సైంటిస్ట్‌ యోగేష్‌ దడేకర్‌ మాట్లాడుతూ పెరటి కోళ్లపెంపకం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుందని వివరించారు. 50 మంది మహిళలకు ఒక్కొక్కరికి 20 చొప్పున కోడి పిల్లలతో పాటు 10 కిలోల దాణా అందజేశారు. కార్యక్రమంలో పశు వైద్యులు ఆనందరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement