రామాలయంలో సుదర్శన హోమం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శనివారం చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం జరిపించారు. అలాగే అంతరాలయంలోని స్వామి వారి మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆ తర్వా త స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కల్యాణ ముత్యాలకు రూ.19 లక్షల విరాళ ం
భద్రాచలం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో వినియోగించే ముత్యాల కోసం ఎన్‌ఆర్‌ఐ జి.పుష్పారావు శనివారం రూ.19 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. మొదట ఆయన స్వామివారిని దర్శించుకున్నా రు. ఆ తర్వాత ముత్యాల కొనుగోలు నిమిత్తం దేవస్థానం ఖాతాకు రూ. 19 లక్షలు బదిలీ చేశారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ఆలయ విశిష్టతను వివరించగా ఈఓ దామోదర్‌రావు జ్ఞాపిక అందజేశారు.
జూలూరుపాడు వాసికి డాక్టరేట్
జూలూరుపాడు: జూలూరుపాడుకు చెందిన జేఎన్‌టీయూహెచ్–జేఏసీ చైర్మన్ మందారంజిత్‌కుమార్‌కు డాక్టరేట్ లభించింది. యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ కె.విజయకుమార్‌రెడ్డి పర్యవేక్షణ లో ఆయన ‘డిజైన్ అండ్ అనాలసిస్ ఆఫ్ ఎస్‌పీవీ సిస్టమ్స్ ఫర్ హైయర్ ఎలక్ట్రికల్ ఔట్‌పుట్ విత్ డిఫరెంట్ ఎంపీపీటీ టెక్నిక్స్’ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు.హైదరాబాద్‌లో శనివారం జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో వీసీ చేతుల మీదుగా రంజిత్ డాక్టరేట్‌అందుకోగా పలువురు అభినందించారు.
రామాలయంలో సుదర్శన హోమం
రామాలయంలో సుదర్శన హోమం


