ఓడరేవుల్లో సివిల్ ఇంజనీర్‌గా ఎంపిక
చింతకాని: భారత ఓడరేవుల(పోర్ట్‌లు)కు సంబంధించి సివిల్ ఇంజనీర్ల ఎంపికకు జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షలో చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీ గ్రామానికి చెందిన షేక్ సలీం ప్రతిభ కనబరిచి ఐదో ర్యాంక్ సాధించాడు. సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో 14 పోస్టులకు నోటిఫికేషన్ రాగా, ఇందులో తొమ్మిది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, ఐదు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈమేరకు 2025 డిసెంబర్ 2వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఎనిమిది మంది ఇతర రాష్ట్రాల వారు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి సలీం మాత్రమే 160 మార్కులకు గాను 146.25మార్కులతో ఐదో స్థానాన నిలిచి ఉద్యోగానికి అర్హత సాధించాడు. ఆయన 1నుంచి 10వ తరగతి వరకు ఖమ్మంలోని కేంద్రియ విద్యాలయంలో, ఇంటర్ న్యూవిజన్ కళాశాలలో, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వరంగల్ ఎన్‌ఐటీలో పూర్తిచేశాడు. సలీం తండ్రి నాగుల్‌మీరా ఖమ్మం మామిళ్లగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా గ్రామస్తులు అభినందించారు. అయితే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్) సాధించడమే తన లక్ష్యమని సలీం వెల్లడించాడు.
నాగులవంచ వాసికి జాతీయ స్థాయిలో
5వ ర్యాంక్


