మాధారం అడవిలో కార్చిచ్చు..
ములకలపల్లి: మండలంలోని మాధారం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుకుంది. ఆ ప్రదేశమంతా పొగతో కమ్ముకుంది. వేసవి సమీపిస్తున్న తరుణంలో అడవిలోని ఎండిన ఆకులకు నిప్పు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. మాధారం – పూసుగూడెం మధ్యలోని అడవిలో క్రమేపీ మంటలు అంటుకుంటుండగా, పాల్వంచ – మందలపల్లి ఆర్‌ఆండ్‌బీ రోడ్డు పక్కగా నాటిక మొక్కలు సైతం అగ్నికి ఆహుతవుతున్నాయి. చిక్కటి అడవిలో మంటలు అంటుకోవడంతో, చెట్టన్నీ నిలువునా మాడిపోతున్నాయి.
గుడుంబా స్థావరాలపై దాడి
కరకగూడెం: మండలంలో గుడుంబా తయారీ, విక్రయ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. మంగళవారం కరకగూడెం ఎస్‌ఐ పీవీఎన్ రావు ఆధ్వర్యంలో కౌలూరు, కలవలనాగారం మధ్యలోని పెదవాగు సమీపంలో 1000 లీటర్ల బెల్లం పానకం, సారా తయరీకి ఉపయోగించే సామగ్రిని గుర్తించి ధ్వంసం చేశారు. ఎస్‌ఐ మాట్లాడుతూ.. ఎవరైనా సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా సమాచారాన్ని 87126 82102, 87126 82103 నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని, చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.
అనారోగ్యంతో ఆత్మహత్య
కామేపల్లి: పింజరమడుగుకు చెందిన మల్లెంపాటి రంగయ్య(70) మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి సమీపాన చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రంగయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉండగా, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
మాధారం అడవిలో కార్చిచ్చు..


