కట్టుదిట్టమైన ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

కట్టు

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా సున్నితమైన పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 49గా ఉంది. ఇక్కడ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసు యంత్రాంగం అదనపు భద్రతా చర్యలు చేపట్టింది. దీంతో పాటు ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 4 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 31 జోనల్‌ అధికారులు, 8 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 10 స్టాటిస్టిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌లు (ఎస్‌ఎస్‌టీలు) ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని ఇప్పటికే జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 నిబంధనలు అమలులో ఉంటాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు
1
1/1

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement