సతీమణి విత్‌డ్రా
● డీసీసీ మాజీ అధ్యక్షుడి
వైరా: వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సతీమణి ఇందుమతి చైర్‌పర్సన్ బరిలో ఉన్నట్లు మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆమె 11వ వార్డు నుంచి నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే, మంగళవారం ఆమె నామినేషన్ ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కొల్లి రమేష్‌కు బీ ఫాం దక్కింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పదేళ్లకు పైగా పనిచేసిన దుర్గాప్రసాద్ తీసుకున్న నిర్ణయం వెనక ఆంతర్యం తేలాల్సి ఉంది.


