‘మన ఇసుక వాహనం’తో పారదర్శకంగా రవాణా
కరకగూడెం: గృహ నిర్మాణ అవసరాల కోసం సరసమైన ధరలకే ఇసుక సరఫరా చేయడమే లక్ష్యంగా ‘మన ఇసుక వాహనం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మైనింగ్ ఏడీ దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పెద్దవాగు ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు త్వరలోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో భాగంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా చేపడతామని వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాక స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ కాంతయ్య, ఆర్‌ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మైనింగ్ ఏడీ దినేష్ కుమార్


