పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బారులో ఆయన పాల్గొని, గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత యూనిట్ అధికారులకు అందజేసి అర్హత మేరకు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గిరిజన దర్బార్‌లో సమర్పించిన అర్జీలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ సున్నం రాంబాబుతోపాటు అశోక్, మధూకర్, అరుణకుమారి, వేణు, సైదులు, లక్ష్మీ నారాయణ, గన్యా, ఆదినారాయణ పాల్గొన్నారు.


