బూర్గంపాడు : పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. మండలంలోని మోరంపల్లి బంజర జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆమె పరిశీలించారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని, తద్వారా పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉండగా ఉపాధ్యాయులను అభినందించారు.
డీఈఓ నాగలక్ష్మి


