రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Feb 28 2026 7:26 AM | Updated on Feb 28 2026 7:26 AM

రోడ్డు ప్రమాదంలో  మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డు సమీపాన శుక్రవారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఏన్కూరుకు చెందిన దుగ్గిరాల కన్నమ్మ(50) గురువా రం అర్ధరాత్రి గార్లఒడ్డు నుండి కాలినడకన ఏన్కూరు వస్తుండగా మార్యమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది, ఘటనాస్థలికి ఎస్‌ఐ నారబోయిన సంధ్య చేరుకుని వివరాలు సేకరించడమే కాక, కన్నమ్మ కుమారుడు నర్సింహా రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

కరెంట్‌ స్తంభం పైనుంచి పడి వ్యక్తి..

ఖమ్మంరూరల్‌: ఏదులాపురం మున్సిపల్‌ పరిధి లోని ముద్దలపల్లి వద్ద కొత్త కరెంట్‌ స్తంభంపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పడిన భూక్యా మురళి(34) మృతిచెందాడు. తల్లాడ మండలం మల్సూరుతండాకు చెందిన మురళి, అదే గ్రామస్తులు కొందరితో కలిసి మద్దులపల్లి ఏరియాలో కొత్త కరెంట్‌ స్తంభాలు వేసే పనికి గురువారం వచ్చాడు. ఈమేరకు పైకి ఎక్కిన ఆయన వైర్‌ లాగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై మురళి భార్య సుప్రియ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దార్యప్తు చేస్తున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

ఖమ్మం స్టేషన్‌లో మధిర వాసి..

ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో మధిరకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. మధిర మండలం ఖమ్మంపాడుకు చెందిన సామినేని శ్రీనివాసరావు(40) కుటుంబ కలహాలతో మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చి తిరుగుతున్నాడు. అనారోగ్యం బారిన పడిన ఆయన శుక్రవారం రైల్వే స్టేషన్‌ ప్రధాన ద్వారం వద్ద మృతిచెందినట్లు గుర్తించగా, ఆయన భార్య భవానికి సమాచారం ఇచ్చినట్లు జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. అనంతరం మృతదేహన్ని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement