ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదుతో
కేసు నమోదు చేసిన పోలీసులు
ఇల్లెందు: పట్టణంలోని 14 నంబర్ బస్తీ(వెంగళరావు నగర్)కు చెందిన నెల రోజుల చిన్నారిని హైదరాబాద్‌కు అక్రమ దత్తత ఇచ్చారు. ఈ విషయమై అంగన్‌వాడీ సూపర్‌వైజర్ కె.రోహిణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని వెంగళరావు నగర్‌కు చెందిన దీపిక–సాగర్ దంపతుల మూడో సంతానం, నెల రోజుల పాపను హైదరాబాద్‌కు చెందిన దూల్‌పేట్– ఆసీఫ్ నగర్‌కు చెందిన రాహుల్ అమర్ ప్రకాష్ రాతి– చంద్రాబాయిలకు గత నెల 28న దత్తత ఇచ్చారు. సమాచారం రావడంతో అంగన్‌వాడీ టీచర్ శారద, సూపర్‌వైజర్ రోహిణి, చైల్డ్ హెల్ప్‌లైన్ (డీసీపీ) ఆఫీసర్ భారతి వెంగళరావు నగర్‌లోని దీపిక–సాగర్‌లను విచారించారు. దత్తత చట్టరీత్యా చెల్లదని సూచించారు. ఈ ఘటనపై సూపర్‌వైజర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సమ్మిరెడ్డి తెలిపారు.


