రైలు ఢీకొని వలస కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వలస కూలీ మృతి

Mar 4 2026 7:37 AM | Updated on Mar 4 2026 7:37 AM

చండ్రుగొండ: చండ్రుగొండ రైల్వేస్టేషన్‌లో గూడ్స్‌ రైలు ఢీకొని వలస కూలీ మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రానికి చెందిన సోయం రాములు (50) వ్యవసాయ కూలీ పనుల కోసం కొంతమంది తో కలిసి వచ్చి రైల్వేస్టేషన్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు. స్టేషన్‌ లూప్‌లైన్‌లో ఆగి ఉన్న రైలు దాటి న రాములును కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందా డు. రాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వివాహిత అదృశ్యం

ములకలపల్లి: వివాహిత అదృశ్యమైన ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సైమధుప్రసాద్‌ కథనంప్రకారం.. సీతారాంపురం గ్రామానికిచెందిన సున్నంమహాలక్ష్మి, భర్త చంటితో కలసి జీవనం సాగిస్తోంది. ఆదివారం రాత్రి బంధు వుల ఇంటికి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులను విచారించినా జాడ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు.

బాలిక అదృశ్యంపై..

భద్రాచలంఅర్బన్‌ : బాలిక అదృశ్యంపై స్థానిక టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆశ్వాపురం గ్రామానికి చెందిన బాలిక భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ట్రైనీ నర్సుగా పని చేస్తోంది. 1వ తేదీ రాత్రి డ్యూటీకి వచ్చిన బాలిక.. 2వ తేదీన ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులను ఆరా తీశారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి మంగళవారం భద్రాచలం టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ శ్యాంప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement