చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం

Mar 7 2026 8:10 AM | Updated on Mar 7 2026 8:10 AM

అశ్వాపురం: ఊపిరితిత్తుల సమస్యతో మండలంలోని అమ్మగారిపల్లి జీపీ కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన పాయం రుత్విక్‌ (2) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనంపై ‘సాక్షి’లో ప్రతురితమైన కథనానికి పలువురు స్పందించారు. జనం కోసం మనం సంస్థ బాధ్యులు రూ.20 వేలు అందించగా.. అశ్వాపురం మండల అధికారులు, పినపాక గ్రామస్తులు రూ.22 వేలు ఇవ్వగా.. మొత్తం రూ.42 వేలను శుక్రవారం చిన్నారి చికిత్స పొందుతున్న అంకుర ఆస్పత్రికి వెళ్లి అందించారు. కార్యక్రమంలో యూడీసీ పద్మావతి, అమ్మగారిపల్లి సర్పంచ్‌ కవిత, పంచాయతీ కార్యదర్శులు వేణుప్రియ, ఎస్‌కే అజార్‌, దొడ్డా శరత్‌, సంస్థ ప్రతినిధులు రోహిత్‌, అజార్‌, అంకుష్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement