మెరుగైన విద్య అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన విద్య అందించాలి

Mar 7 2026 8:09 AM | Updated on Mar 7 2026 8:09 AM

జూలూరుపాడు: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా కృషి చేయాలని డీఈఓ, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం ఆమె జూలూరుపాడు కేజీబీవీని తనిఖీ చేశారు. కిచెన్‌ రూమ్‌, స్టోర్‌ రూమ్‌లో నిత్యావసర సరుకులు, కూరగాయలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రిపరేషన్‌ విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం మండల ప్రజాపరిషత్‌ అభివృద్ధి కార్యాలయాన్ని సందర్శించి, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక(99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌)పై అధికారులతో సమావేశమయ్యారు. ఎంపీడీఓ పూరేటి అజయ్‌, అధికారులు తాళ్లూరి రవి, తులసీరామ్‌, పద్మజ, రామారావు పాల్గొన్నారు.

డీఈఓ బి.నాగలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement