భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం | - | Sakshi
Sakshi News home page

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం

Feb 28 2026 7:26 AM | Updated on Feb 28 2026 7:26 AM

భక్తు

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం

భద్రాచలం: శ్రీసీతారామ చంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందిస్తున్నట్లు ఆలయ ఈఓ కె.దామోదర్‌రావు అన్నారు. గురువారం ఆయన నిత్యాన్నదాన సత్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ప్రసాద నాణ్యత అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం అందిస్తున్నామని ఈఓ తెలిపారు.

అమలాపురంలో రామయ్య కల్యాణం

ఏపీలోని అమలాపురంలో జరిగిన స్వామి వారి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ధర్మప్రచారంలో భాగంగా అమలాపురానికి ప్రచారరథం ద్వారా వెళ్లిన స్వామి వారికి శోభాయాత్ర నిర్వహించి, కల్యాణాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు జరిపించారు.

ఆర్చరీ ఎంపిక పోటీలకు ట్రయల్స్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాస్థాయి ఆర్చరీ మినీ అండర్‌–15, 13, 10 విభాగాల్లో బాలురు, బాలికల ఎంపికకు ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్‌ బాధ్యులు సాధుల సారంగపాణి, పుట్టా శంకరయ్య తెలిపారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఆదివారం ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కన్వీనర్లుగా స్పోర్ట్స్‌ స్కూల్‌ హెచ్‌ఎం బి.చందు, పీడీ ఎస్‌.బాలసుబ్రహ్మణ్యం, క్రీడాకారుల ఎంపిక అనంతరం కోచింగ్‌ ఇన్‌చార్జ్‌లుగా జి.మారప్ప, ఎ.దుర్గయ్య, కె.కళ్యాణ్‌, పి.నగేశ్‌ వ్యవహరిస్తారని తెలిపారు. రికర్వ్‌, కాంపౌండ్‌, ఇండియన్‌ రౌండ్లలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అండర్‌–10కు 2016, జనవరి 1 తర్వాత, అండర్‌–13కు 2013 జనవరి 1 తర్వాత, అండర్‌–15 విభాగానికి 2011 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వారు వివరించారు.

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణారావు

ఖమ్మంమామిళ్లగూడెం: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్‌ కేవీ కృష్ణారావు నియమితులయ్యారు. అలాగే, ఉమ్మడి జిల్లా చైర్మన్‌గా పుసుపులేటి నాసరయ్యను నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్‌ ఒక ప్రక్రటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు, నాసరయ్య మాట్లాడుతూ.. ఉద్యమకారుల హక్కుల సాధనతో పాటు వారి సంక్షేమ అవసరాల కోసం పాటుపడతామని తెలిపారు.

రాష్ట్రస్థాయి సైన్స్‌ సెమినార్‌కు ఉపాధ్యాయులు

కొత్తగూడెంఅర్బన్‌: రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ఏటా జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సెమినార్‌ నిర్వహిస్తున్నారు. ఈ సెమినార్‌కు జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వారిలో పాత కొత్తగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి గుంటి అనురాధ, మణుగూరు జెడ్పీహెచ్‌ఎస్‌ నుంచి కలం పరమయ్య, రొంపేడు ఏజీహెచ్‌ఎస్‌ నుంచి ఎం.పార్వతి ఉన్నారని జిల్లా సైన్స్‌ అధికారి సంపత్‌కుమార్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగే సెమినార్‌లో ప్రసంగించనున్నారు. వీరిని డీఈఓ బి.నాగలక్ష్మి, నాగరాజుశేఖర్‌, సైదులు, ఎంఈఓలు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

ఉపాధ్యాయుడి

ప్రవర్తనపై ఆగ్రహం

మధిర: మండలంలోని దెందుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ప్రజాప్రతినిధులతోపాటు గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు వారి తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిసింది. ఈమేరకు సమాచారంతో శుక్రవారం సర్పంచ్‌ పగిడిపల్లి శ్రీనివాసరావు తదితరులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించగా, అది తన వ్యక్తిగత విషయమని ఉపాధ్యాయుడు బదులిచ్చాడు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ విషయమై హెచ్‌ఎం రాజకుమారిని వివరణ కోరగా... శనివారం స్టాఫ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయగా, బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. కాగా, ఘటనపై అధికారులు విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం1
1/2

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం2
2/2

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement