పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశలో పనిచేస్తున్న కార్మికులకు ఇన్ చార్జ్ పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) రాష్ట్ర అధ్యక్షుడు కేవీ.రామారావు అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ జె.సూర్యనారాయణకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కర్మాగారంలో 2024–25 డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ నిర్వహించినట్లు చెప్పారు. జేపీఏ నుంచి ఫోర్‌మెన్ గ్రేడ్–1 వరకు 25 మంది కార్మికులకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్‌గా ఇద్దరికి పదోన్నతులు రావాల్సి ఉందన్నారు. వైటీపీఎస్‌లో గత నెలలోనే ఉత్తర్వులు ఇచ్చారు కానీ, పెండింగ్‌లో ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌డీ.సత్యరాజ్ స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్ సయ్యద్, టి.రాములు పాల్గొన్నారు.


