నేత్రపర్వంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

Mar 3 2026 8:07 AM | Updated on Mar 3 2026 8:07 AM

ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఎదుర్కోలు ఉత్సవానికి తోడ్కొని వెళ్లిన అర్చకులు.. ఆ కార్యక్రమ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను కల్యాణ మండపంపై కొలువుదీర్చి.. వేద పండితులు ప్రతాపురం గిరిధరాచార్యులు, ఆలయ ప్రఽధానార్చకులు ప్రతాపురం ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వైభవోపేతంగా కల్యా ణం జరిపించారు. భక్తుల సౌకర్యార్థం పలుప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కల్యాణ వేడుకకు భారీగా భక్తులు హాజరుకాగా, అన్నప్రసాదం అందించారు. సర్పంచ్‌ లకావత్‌ లక్ష్మి, ఆలయ మేనేజర్‌ పాకాల వెంకట రమణ, శివాలయ పునఃనిర్మాణకర్త మారగాని శ్రీనివాసరావు, చైర్మన్‌ మల్లెల నర్సింహారావు, పర్సా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

ములకలపల్లిలో..

మూకమామిడిలోని సమ్మక్క, సారలమ్మ. వీర్ల అంకమ్మ, రుక్మిణీ, సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని సోమవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. దేవాలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాల సడుమ మహా సుదన్శన సహిత చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం ఎరుర్కోలు ఉత్సవం, రాత్రి 10 గంటలకు సంతాన వేణుగోపాల స్వామి, రుక్మిణీ, సత్యభామ వివాహ క్రతువును కనులపండువగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement