రైతులు ఆర్థికంగా నష్టపోవొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు ఆర్థికంగా నష్టపోవొద్దు

Feb 28 2026 7:26 AM | Updated on Feb 28 2026 7:26 AM

రైతులు ఆర్థికంగా నష్టపోవొద్దు

రైతులు ఆర్థికంగా నష్టపోవొద్దు

అశ్వారావుపేటరూరల్‌: పొగాకు పంటను సాగు చేసే రైతులు బోర్డు పరిమితులకు లోబడి పంటను సాగు చేయాలని, అధికంగా సాగు చేసి, ఆర్థికంగా నష్టపోవొద్దని పొగాకు బోర్డు రీజినల్‌ మేనేజర్‌ సురేంద్ర కుమార్‌ సూచించారు. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు ఆర్‌ఎం, అధికారులు, శాస్త్రవేత్తల బృందం శుక్రవారం అశ్వారావుపేట మండలంలో సాగు చేస్తున్న పొగాకు క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఊట్లపల్లిలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉందని తెలిపారు. సాగు మెలుకువలు పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ సుంకవల్లి వీరభద్రరావు, సీటీఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సుబ్బయ్య, బోర్డు అధికారులు పాల్గొన్నారు.

పొగాకు బోర్డు ఆర్‌ఎం సురేంద్ర కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement