3న పెద్దమ్మతల్లి ఆలయం మూసివేత
పాల్వంచరూరల్ : చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3వ తేదీన పెద్దమ్మతల్లి ఆలయంతో పాటు పక్కనున్న శివాలయాన్ని మూసివేయనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు, మహానివేదన అనంతరం ద్వార బంధనం చేసి, తిరిగి బుధవారం ఆలయ సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల తర్వాత ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి సెమినార్‌లో ప్రతిభ
ఇల్లెందురూరల్: జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్‌లో రొంపేడు బాలికల ఆశ్రమ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు ఎం.పార్వతి ప్రతిభ చాటారు. జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు సెమినార్‌లో పాల్గొనే అవకాశం లభించగా.. సంబంధిత అంశాలపై ప్రసంగాల అనంతరం జిల్లాకు ఒకరు చొప్పున ఉత్తమ ప్రదర్శకులుగా ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. కాగా, జిల్లా నుంచి ఆ అవకాశం పార్వతికి దక్కింది. సెమినార్ అనంతరం బెస్ట్ పర్ఫామెన్స్ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె అందుకున్నారు. రాష్ట్ర స్థాయి సెమినార్‌లో ప్రతిభ కనబర్చిన పార్వతిని ఎంఈఓ ఉమాశంకర్, ఏటీడీఓ భారతీదేవి, రొంపేడు హెచ్‌ఎం పద్మ అభినందించారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11–45 గంటలకు భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లను మంత్రి సన్మానించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తారు. అలాగే, సాయంత్రం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి పాల్గొంటారు.
ఫిజికల్ సైన్స్ టీచర్ల
జిల్లా కమిటీ ఎన్నిక
టేకులపల్లి: ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్(ఎఫ్‌పీఎస్‌టీ) జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కొత్తగూడెంలోని ఆనందఖని జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడిగా టేకులపల్లి జీహెచ్‌ఎస్ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు ఎం.మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ఏ.శంకర్‌రావు(జెడ్పీహెచ్‌ఎస్, నెల్లిపాక బంజర), గౌరవ అధ్యక్షులుగా ఎన్.రాజశేఖర్(ఏఎంఓ), గౌరవ కార్యదర్శిగా ఎస్.కే.సైదులు(సీఎంఓ) ఎన్నికయ్యారు. అలాగే, కోశాధికారిగా ఎస్.యశోద(పాల్వంచ), ఇతర పదవులకు జి.అనురాధ(కొత్తగూడెం), ప్రభుసింగ్(ఇల్లెందు), జె.లక్ష్మి(రుద్రంపూర్), బి.బాసు(భద్రాచలం), బి.బిచ్చ(ములకలపల్లి), ఉమాదేవి(బూర్గంపాడు), డి.రామిరెడ్డి(పినపాక), టి.పాపారావు(పాల్వంచ), సీహెచ్.శ్రీనివాస్(భద్రాచలం), కె.నాగేశ్వరరావు(మణుగూరు), రామకృష్ణ(భద్రాచలం), పి.దుర్గాశైలజ(పాల్వంచ), ఎం.ఎం.భాస్కరాచారి(దమ్మపేట), బి.దేవీ లాల్(కొత్తగూడెం), ఎస్.శాంతకుమారి(జూలూరుపాడు), ఎం.రఘు(ఇల్లెందు)ను ఎన్నుకున్నారు. నూతన కమిటీని డీఎస్‌ఓ సంపత్‌కుమార్ తదితరులు అభినందించారు.
3న పెద్దమ్మతల్లి ఆలయం మూసివేత


