గిరిమాల్ట్ పనుల్లో వేగం పెంచండి
భద్రాచలం : భద్రాచలంలో జరుగుతున్న గిరి మాల్ట్ పనులను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పనులు పరిశీలించాక మాట్లాడుతూ.. గిరిజనులు చేసే ఉత్పత్తులన్నీ ఒకే చోట లభించేలా గిరి బజార్‌ను గిరి మాల్ట్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి నాటికి గిరిమాల్ట్ ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. గిరిజన మహిళలకు జీవనోపాధి కల్పించడంతో పాటు ప్రజలకు కల్తీ లేని నిత్యావసరాలు లభ్యమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ మధుకర్, డీఈ హరీష్, టీఏ శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘పది’ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ఇలెందు/ఇల్లెందురూరల్ : గిరిజన విద్యార్థుల ఉన్నతి కోసం అనేక సంస్కరణలు చేపట్టామని, ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకుని ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ సక్రమంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. శనివారం ఆయన ఇల్లెందులోని బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఉద్దీపకం వర్క్‌బుక్‌లోని అంశాలతో పాటు అక్షరమాల, అధికారుల పేర్లను పిల్లలతో బోర్డుపై రాయించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు ముగిసేంత వరకు పదో తరగతి విద్యార్థులను ఇళ్లకు పంపించొద్దని ఆదేశించారు. ఉదయం, సాయంత్రం స్టడీ హవర్లు నిర్వహించాలని కోరారు. ఆ తర్వాత మోదుగలగూడెంలో సూరప్ప యాష్ బ్రిక్ యూనిట్‌ను ప్రారంభించి మాట్లాడారు. రూ. 25 లక్షల వ్యయంతో నెలకొల్పిన ఈ యూనిట్‌ను గిరిజన మహిళలు కలిసికట్టుగా నిర్వహించి జీవనోపాధి పొందడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ డేవిడ్‌రాజ్, జేడీఎం హరికృష్ణ, హెచ్‌ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి
పాల్వంచ: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని పీఓ రాహుల్ అన్నారు. శనివారం స్థానిక ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల ప్రాజెక్టులను తిలకించి అభినందించారు. అనంతరం డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఏసీఎంఓ రమేష్, ఏటీడీఓ ఎస్.చంద్రమోహన్, సైన్స్ ఉపాధ్యాయులు డి.రమాదేవి, రామనాధం, అనిత, స్వామి, సోమ్లా పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


