వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ
భద్రాచలం: పునర్వసు నక్షత్రం సందర్భంగా శనివారం భద్రగిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. కంచర్ల గోపన్న సేవా సమితి, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో భక్తులు, అర్చకుల శ్రీరామ నామస్మరణల నడుమ కోలాహలంగా సాగింది. శ్రీరామదాసు విగ్రహానికి పూలమాల వేసి హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు, కంచర్ల గోపన్న సేవా సమితి నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం..
దేవస్థానంలో స్వామి వారి మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిచారు.
కంప్యూటర్ల వితరణ
దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కవిత రూ.1,59,300 విలువైన మూడు కంప్యూటర్లను వితరణగా అందజేశారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ


