కాంగ్రెస్ శ్రేణుల నిరసన ర్యాలీ
భద్రాచలంటౌన్/ములకలపల్లి: పార్టీలో వలస నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ఏళ్ల తరబడి జెండా మోసిన అసలైన కార్యకర్తలను పక్కనబెడుతున్నారని ఆరోపిస్తూ శనివారం ములకలపల్లి నుంచి భద్రాచలం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీనియర్ నాయకుడు పాలకుర్తి రత్నభూషణం ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొని తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు రామయ్యకు, అలాగే అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికై నా పార్టీ అధిష్టా నం స్పందించి నిజమైన కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తొలుత ములకలపల్లిలో భక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు.
ప్రమాద స్థలిని
పరిశీలించిన ఎస్పీ
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల స్టేజీ సమీపంలో ఈనెల 25న జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ రోహిత్‌రాజు శనివారం పరిశీలించారు. డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ తాటిపాముల సురేష్‌తో కలిసి ఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు, అతని తండ్రి ఆరోగ్య పరిస్థితులను వాకబు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నేషనల్ హైవే అఽధికారుల సహకారంతో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పెట్రోల్ బంక్ పరిసరాల్లో రోడ్డుపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మసీద్ ప్రాంగణంలో ఎగిసిన మంటలు
పాల్వంచ: పట్టణంలోని ఇందిరా కాలనీ వద్ద గల మసీద్ ప్రాంగణంలో చెత్తకు గుర్తు తెలి యని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. మసీద్ ప్రాంగణం సుమారు నాలుగైదు ఎకరా ల్లో ఉండటం, అక్కడ చెట్లు, చెత్తా చెదారం భారీ ఎత్తున ఉండటంతో భారీ ఎత్తున మంట లు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మజీద్ కమిటీ సమాచారంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపు చేశారు.
కేంద్ర స్కాలర్‌షిప్‌నకు
ఎంపిక
అశ్వారావుపేటరూరల్: కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్)కు అశ్వారావుపేట జిల్లా పరి షత్ ఉన్నత బాలుర పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఎంపికై నట్లు హెచ్‌ఎం పి.హరిత తెలి పారు. ఈ మేరకు ఆమె శనివారం వివరాలు వెల్లడించారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎ.వీరేన్, బి.మణిచందనరాజు స్కాలర్‌షిప్ పరీక్షలో ప్రతిభ చూపారని పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి రూ.12వేల చొప్పున కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతుందన్నా రు. ఎంపికై న విద్యార్ధులను ఈ సందర్భంగా హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన
ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం వెలుగుమట్ల లో ఇటీవల కూల్చివేసిన ఇళ్లను ఆదివారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ పరిశీలించనున్నారు. భూదాన్ భూము ల్లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో పలువురు గిరిజనులు ఉండగా, వారికి పునరావాసం కల్పించకుండా కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్షేత్రస్థాయి లో పరిశీలన, బాధితులను పరామర్శించేందుకు హుస్సేన్‌నాయక్ వస్తున్నారని నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ శ్రేణుల నిరసన ర్యాలీ
కాంగ్రెస్ శ్రేణుల నిరసన ర్యాలీ
కాంగ్రెస్ శ్రేణుల నిరసన ర్యాలీ


