సుమారు 6 నెలల తర్వాత
కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
పోటెత్తిన ఫిర్యాదుదారులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సుమారు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ నిర్వహించగా, జిల్లా నలు మూలల నుంచి ఫిర్యాదుదారులు పోటెత్తారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ రవీంద్రనాఽథ్, డీపీఓ సుధీర్‌తో కలిసి కలెక్టర్ అంకిత్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి, తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజావాణి దరఖాస్తుల్లో కొన్ని..
● కొత్తగూడెంకార్పొరేషన్ 3వడివిజన్ వెంగళరావు కా లనీ బస్తీదవాఖాన అద్దె ఇంట్లో నిర్వహిస్తున్నారని, గత కలెక్టర్ చొరవతో రూ.20లక్షలు వెచ్చించి నూ తన భవనం నిర్మించినా రోడ్డు సౌకర్యం లేక ప్రా రంభించలేదని తాళ్లూరి సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుచేయగాడీఎంహెచ్‌ఓకు ఎండార్స్ చేశారు.
● భద్రాచలానికి చెందిన శేషగిరిరావు.. తనకు గతంలో జారీ చేసిన సదరమ్ సర్టిఫికెట్‌లో 57 శాతం వైకల్యం ఉండగా ఇటీవల 2శాతం తగ్గించారని, మళ్లీ 57 శాతంతో సర్టిఫికెట్ మంజూరు చేయాలని వినతిపత్రం అందించగా డీఆర్‌డీఓకు ఎండార్స్ చేశారు.
● చుంచుపల్లి మండలం పెనగడపలో రెండు వాటర్ ప్లాంట్లు ఉన్నా తాగునీరు అందడం లేదని, మూడు కిలోమీటర్ల దూరంలోని రాంపురానికి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని, వేసవికాలం అయినందున ఒక్క ప్లాంట్ అయినా తెరిపించాలని స్థానికులు వినతిపత్రం అందించారు
● సింగరేణి సీఎస్సార్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని మాయాబజార్, 5 ఇంక్లైన్‌్, ఎస్‌ఆర్‌టీ నగర్ వాసులు వినతిపత్రం అందజేశారు. అలాగే, నిరుద్యోగులకు డీఎల్‌ఆర్ ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు.
● చర్ల మండలానికి చెందిన తడికల నాగరాజు తన కుమార్తె వివాహానికి కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోగా తిరస్కరించారని, పునర్ పరిశీలించి మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వగా భద్రాచలం సబ్ కలెక్టర్‌కు ఎండార్స్ చేశారు.


