ఆయిల్‌పామ్‌ గెలల ధర పెంపు | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ గెలల ధర పెంపు

Mar 3 2026 8:07 AM | Updated on Mar 3 2026 8:07 AM

టన్నుకు రూ.21,546గా నమోదు

అశ్వారావుపేట: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ప్రకటించిన ఆయిల్‌పామ్‌ గెలల ధర మరో మారు రికార్డు స్థాయికి చేరింది. గతనెల ధర కంటే ప్రస్తుతం మరో రూ.1,090 పెరిగింది. 2023లో టన్ను గెలల ధర రూ.23 వేలకు చేరగా ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో నమోదైన రూ.20,456 ధరే అత్యధికంగా రికార్డు కెక్కింది. అయితే ఇప్పుడు టన్నుకు రూ.1,090 చొప్పున పెరిగి రూ.21,546కు చేరింది. కాగా గడిచిన మూడేళ్లలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. గత నెల రూ.20 వేలు దాటడమే రికార్డు కాగా, ఫిబ్రవరిలో రైతులు ఫ్యాక్టరీకి తరలించిన గెలల ధర రూ.21,546గా నిర్ధారించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్‌ఫాం క్రూడాయిల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా మంచి ధర లభింస్తుండగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాహుల్‌గాంధీని కలిసిన డీసీసీ అధ్యక్షురాలు

కొత్తగూడెంఅర్బన్‌: వికారాబాద్‌ సమీపంలోని అనంతగిరి హిల్స్‌లో తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హాజరు కాగా, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న ఆయనను కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని రాహుల్‌కు వివరించామని తెలిపారు. ఆయనను కలిసిన వారిలో నాయకులు ఆళ్ల మురళి, చీకటి కార్తీక్‌, జగన్‌ ఉన్నారు.

గిరిజనుల సమస్యలకు పరిష్కారం

భద్రాచలం: గిరిజనులు సమర్పించే సమస్యల దరఖాస్తులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఐటీడీఏ డీడీ అశోక్‌ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసి న గిరిజన దర్బార్‌లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు అఽధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కాగా తొలుత మాజీ లోక్‌సభ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారులు సున్నం రాంబాబు, మధుకర్‌, వేణు, అరుణకుమారి, లక్ష్మీనారాయణ, గన్యా, ఉదయ్‌, నారాయణ రావు, ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

కరాటే పోటీలో ప్రతిభ

దమ్మపేట : ఖమ్మం జిల్లా వి.ఎం.బంజరలోని నిర్వహించిన ఆలిండియా కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీలో నాగుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించారు. శ్రీవిద్య, తేజస్విని, కై రున్నీసా గోల్డ్‌ మెడల్‌ గెలుచుకోగా, అదే పాఠశాలకు చెందిన అనుశ్రీజ, సంజన రజత పతకాలు, నందిని, సాత్విక కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయా విద్యార్థులను హెచ్‌ఎం బజ్జూరి సరళ, కరాటే మాస్టర్‌ పవన్‌ కృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement