ఆకస్మిక తనిఖీలు చేస్తా.. | - | Sakshi
Sakshi News home page

ఆకస్మిక తనిఖీలు చేస్తా..

Mar 3 2026 8:07 AM | Updated on Mar 3 2026 8:07 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ‘బాఽధ్యతగా పనిచేయండి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీచేస్తా.. కారణం లేకుండా ఎవరైనా కార్యాలయాలను వీడి వెళితే చర్యలు తప్పవు’ అని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి అనంతరం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా వాణికి తప్పకుండా జిల్లా అధికారులే హాజరు కావా లని ఆదేశించారు. ఆ రోజు శాఖా పరమైన పనుల నిమిత్తం ఎక్కడికై నా వెళ్లినా ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తుంటారని, ఆ సమయంలో సంబంధిత అధికారులు లేకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. అన్ని శాఖల పనులపై సమీక్షలు ఉంటాయని, జిల్లా అభివృద్ధికి ప్రతీ ఒక్కరు కట్టుబడి ఉండాలని సూచించారు. శాఖా పరమైన ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని, స్థానికమైనా, సెక్రటేరియట్‌ స్థాయిదైనా పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

శ్రీపాదరావుకు ఘన నివాళి

అసెంబ్లీ స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని కలెక్టర్‌ అంకిత్‌ కొనియాడారు. శ్రీపాదరావు జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో స్పీకర్‌గా విశిష్ట పాత్ర పోషించారని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు

కలెక్టర్‌ అంకిత్‌ హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement