అడవిలో చెలరేగిన మంటలు | - | Sakshi
Sakshi News home page

అడవిలో చెలరేగిన మంటలు

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

అడవిల

అడవిలో చెలరేగిన మంటలు

అశ్వాపురం: మండల మొండికుంట గ్రామ సమీపంలో తుమ్మలచెరువు రహదారి మార్గంలో గుట్టపై ఆదివారం రాత్రి అడవిలో మంటలు చెలరేగాయి. అడవి తగలబడటం పర్యావరణానికి ముప్పు అని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. అటవీ శాఖ అధికారులు అడవులు కాలిపోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రెండు ట్రాక్టర్లు ఢీకొని యువకుడు మృతి

చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు ట్రాక్టర్లు ఢీకొని బోనకల్‌ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన శ్రీరామ నాగయ్య (19) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగయ్య బోనకల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బోనకల్‌ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన బుంగ రాంబాబు శనివారం రాత్రి నాగయ్యకు ఫోన్‌ చేసి ఇసుక రవాణా చేసేందుకు తన ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా రావాలని కోరాడు. రాంబాబు ట్రాక్టర్‌ను తీసుకుని ముదిగొండ మండలం గంధసిరి మున్నేరుకు వెళ్లి ఇసుక లోడ్‌ చేయించుకుని ఆదివారం తెల్లవారుజామున చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీకి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చిన్నమండవ గ్రామానికి చెందిన కాశిమాల రాజ్‌కుమార్‌కు చెందిన ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోగా రెండు ట్రాక్టర్లు ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న గోతిలో పడిపోయాయి. ట్రక్కులోని ఇసుక నాగయ్యపై పడి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి పుల్లమ్మ రాజ్‌కుమార్‌ నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మృతిచెందాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ వీరేందర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

అడవిలో చెలరేగిన  మంటలు
1
1/1

అడవిలో చెలరేగిన మంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement