భద్రగిరి రామయ్యకు అభిషేకం | - | Sakshi
Sakshi News home page

భద్రగిరి రామయ్యకు అభిషేకం

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

భద్రగ

భద్రగిరి రామయ్యకు అభిషేకం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరా ధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వా మి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఈఓ దామోదర్‌రావు ప్రారంభించారు. ఫిబ్రవరిలో 1,99,248 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఈఓ తెలిపారు.

రేపు రామాలయం మూసివేత

భద్రగిరి రామయ్యకు అభిషేకం1
1/1

భద్రగిరి రామయ్యకు అభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement