పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి జిల్లా నలుమూలలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
కొత్తగూడెంఅర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్నిశాఖల జిల్లాఅధికారులు సకాలంలో హాజ రుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉద యం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
నేడు ఐటీడీఏలో
గిరిజన దర్బార్
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనుల తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అందజేయాలని కోరారు.
తహసీల్‌లో కూడా..
భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో కూడా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు మరో ప్రకటనలో తెలిపారు.
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలా శయం, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించా రు. 393 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.19,475 ఆదాయం లభించింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.11,040 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
నెమలి జాతరకు
ప్రత్యేక బస్సులు
మఽధిర : ఏపీలోని గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా సోమవారం మధిర బస్టాండ్ నుంచి నెమలి వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మధిర డీఎం ఆర్.రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 5 గంటల నంచి మధిర బస్టాండ్‌లో బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాత్రి స్వామివారి కల్యాణం ముగిసే వరకు నెమలి నుంచి మధిరకు బస్సులు తిరుగుతుంటాయని పేర్కొన్నారు. మధిర నుంచి నెమలికి పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.30 చార్జీ ఉంటుందని వివరించారు.
పెద్దమ్మతల్లికి విశేష పూజలు


