ఆరోగ్యంపై అవగాహన..
చుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఖమ్మం సైక్లింగ్ క్లబ్ సభ్యులు సైక్లింగ్ కార్యక్రమం చేపట్టారు. ఖమ్మం నుంచి సైక్లింగ్ ప్రారంభించి సైకిల్‌పై 70 కిలోమీటర్ల ప్రయాణించి ఆదివారం కొత్తగూడెం చేరుకున్నారు. అనంతరం కొత్తగూడెం సైక్లింగ్ క్లబ్ సభ్యులతో కలిసి సుమారు 50 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి అటవీ ప్రాంతాన్ని, జగ్గారం గొత్తి కోయల నివాసాలను, పోడు భూములను, అటవీ శాఖ ప్లాంటేషన్లను సందర్శించారు. సెంట్రల్ పార్క్‌లో అందరూ మొక్కలు నాటారు. సంరక్షణకు ఒక మొక్కకు రూ. 500 చొప్పున విరాళం అందించారు. ఈ సందర్భంగా ఖమ్మం సైక్లింగ్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ మహేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య రక్షణతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఖమ్మం సైక్లింగ్ క్లబ్ ఉపాధ్యక్షుడు, కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ యు. కోటేశ్వరరావు, సైక్లింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


