ఆర్చరీ పోటీల్లో 12 మంది ఎంపిక
పాల్వంచరూరల్: మండలపరిధి కిన్నెరసానిలోని గిరిజన క్రీడాపాఠశాల మైదానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం ఆర్చరీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–15, అండర్–13, అండర్–10 బాలబాలికల జిల్లా స్థాయి ఎంపికలు చేసినట్లు ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య తెలిపారు. 10వ ఇండియన్ రౌండ్‌లో బాలుర విభాగంలో ఎం.విక్రాంత్, బి.అభియరామ్‌నాయక్, పి.సాయి, బి.శ్రీహర్షితరామ్‌నాయక్, జి.స్వాతిక్, కె.చేగువీరా, బాలికల విభాగంలో డి.అశ్వికప్రకాశ్, మానశ్వినీ, వి.రిత్విక, కన్యాశ్రీ, రీనా, శరణ్య, మనుశ్రీలు ఎంపికయ్యారని పేర్కొన్నారు.


