5 క్వింటాళ ్ల బొగ్గు చోరీ.. | - | Sakshi
Sakshi News home page

5 క్వింటాళ ్ల బొగ్గు చోరీ..

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

5 క్వ

5 క్వింటాళ ్ల బొగ్గు చోరీ..

అశ్వాపురం: మణుగూరులోని సింగరేణి కొండాపురం కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ నుంచి మండలంలోని భారజల కర్మాగారానికి రోప్‌వే ద్వారా బకెట్లలో సరఫరా అవుతున్న బొగ్గును కొందరు అక్రమంగా దొంగిలించి మండల పరిధిలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఐదు క్వింటాళ్ల బొగ్గును దొంగిలించి ట్రాక్టర్‌లో మణుగూరుకు చెందిన ఉడతనేని శ్రీను గొందిగూడెం వద్ద తన ఇటుక బట్టీలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో

శ్రీనుతో పాటు డ్రైవర్‌ గోవింద శ్రీనివాస్‌ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

రాత్రి సమయాల్లో చోరీ..

మణుగూరు నుంచి భారజల కర్మాగారానికి రోప్‌వే ద్వారా బొగ్గు ఆకాశమార్గంలో బకెట్లలో సుమారు 10 కిలోమీటర్ల సరఫరా అవుతుంది. అయితే బొగ్గును రాత్రి సమయాల్లో కొందరు వ్యక్తులు చోరీ చేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో బొగ్గు చోరీపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని, అక్రమ బొగ్గు రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

5 క్వింటాళ ్ల బొగ్గు చోరీ..1
1/1

5 క్వింటాళ ్ల బొగ్గు చోరీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement