60 ట్రాక్టర్ల ఇసుక సీజ్
మణుగూరుటౌన్: మండల పరిధిలోని కొండాయిగూడెం ప్రాంతంలో అక్రమ ఇసుక నిల్వలపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. శనివారం ఆర్‌ఐ గోపి, జీపీఓ శివకుమార్, మండల సర్వేయర్ నరేష్ తనిఖీలు నిర్వహించి సుమారు 60 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు.
రెండు ఇసుక లారీలు..
మణుగూరు టౌన్: రామానుజవరం గ్రామంలోని ఓ ప్రదేశం నుంచి గుట్టుచప్పుడు కాకుండా లారీల్లో ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని శనివారం కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నగేశ్ తెలిపారు. విచారణ జరిపి జేసీబీలను సీజ్ చేయడంతోపాటు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
హత్య కేసులో
నిందితుడి రిమాండ్
తిరుమలాయపాలెం: మండలంలోని పడమటితండాకు చెందిన రామచంద్రు తన కుమార్తెను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించగా.. హత్య చేసిన బానోతు సాయిని శనివారం కోర్టులో హాజరుపర్చినట్లు కూసుమంచి సీఐ సంజీవ్ తెలిపారు. ఫిబ్రవరి 24న ఈ హత్య జరగగా, నిందితుడు అదేరోజు పోలీసులకు లొంగిపోయాడు. విచారణ అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచామని సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ కూచిపూడి జగదీశ్ పాల్గొన్నారు.


