రామభ క్తుల పాదయాత్ర
అశ్వారావుపేటరూరల్: మైళ్ల కొద్ది దూరాన్ని ఆ శ్రీరాముడే నడిపిస్తున్నాడని, ఏటా శ్రీరామ నవమి పండుగ ముందు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి కాలినడక వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని రామభక్తుల బృందంతెలిపారు.ఏపీలో ని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామం నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలోగల భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయానికి 120మంది భక్తులు పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. ఈ బృందం ఆదివారం మధ్యాహ్నం అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం వద్దగల శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు చేరింది. అనంతరం రామ నామాన్ని జపిస్తూ.. భద్రాచలానికి వెళ్లారు.
వరకట్న వేధింపులపై
కేసు నమోదు
పాల్వంచరూరల్: అదనపుకట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న భర్త, అత్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన పామర్తి ప్రనూష ఏపీ రాష్ట్రంలోని ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరు గ్రామానికి చెందిన పామర్తి దుర్గారావుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎస్‌ఎస్‌శ్రీ కూతురు ఉంది. అయితే కొద్దిరోజులుగా భర్త మద్యానికి అలవాటు పడి అదనపు కట్నం తేవాలని నిత్యం వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, ఈ విషయాన్ని అత్తకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆదివారం ప్రనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు భర్తతో పాటు అత్త కృష్ణవేణిలపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
బ్రిడ్జిపై నుంచి పడి
వ్యక్తికి తీవ్ర గాయాలు
గుండాల: ద్విచక్ర వాహనంపై వస్తూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కథనం ప్రకారం.. ఆళ్లపల్లి మండలంలోని జాకారం గ్రామానికి చెందిన పాయం క్రిష్ణ మర్కోడు నుంచి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈక్రమంలో నడిమిగూడెం–జాకారం మధ్య జల్లేరు వాగు బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రుడిని 108లో ఆళ్లపల్లి ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించారు.
ఆగి ఉన్న స్కార్పియోను ఢీకొట్టిన లారీ..
టేకులపల్లి: రోడ్డు పక్కన ఆగి ఉన్న స్కార్పియోను వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న మాజీ సర్పంచ్, ఆయన కుమారుడు ప్రాణాలతో బయట పడ్డారు. టేకులపల్లి ఎస్‌ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం కొత్తతండా(పి) మాజీ సర్పంచ్ భూక్య పాపానాయక్ తన కుమారుడు రాజేష్‌తో కలిసి స్కార్పియోలో ఆదివారం టేకులపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈక్రమాన డీజిల్ కొట్టించేందుకు కుడివైపు ఉన్న బంకు వైపు క్రాస్ అయ్యేందుకు రోడ్డుకి ఎడమ వైపు వాహనాన్ని ఆపాడు. ఈ సమయాన ఇసుక లోడు కోసం భద్రాచలం వైపు వెళ్తున్న టీజీ07డబ్ల్యూ 3456 నంబర్ గల లారీ వేగంగా దూసుకొచ్చి స్కార్పి యోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో స్కార్పి యో ముందుకు దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం విరిగి వాహనంపై పడింది. వాహనంలో ఉన్న ఇద్దరికి ఏమీ కాలేదు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలా నికి చేరుకుని లారీని పోలీసుస్టేషన్‌కు తరలించా రు.బాధితుడి ఫిర్యాదుమేరకు సూర్యాపేటకు చెం దిన లారీ డ్రైవర్ మరికంటి రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బీసీలకు 42 శాతం
రిజర్వేషన్ అమలు చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఖమ్మం టీటీడీసీ భవన్‌లో ఆదివారం జరిగిన బీసీ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానతల కారణంగా ఇప్పటికీ చట్టసభల్లో బలహీనవర్గాల వారికి సరైన ప్రాతినిథ్యం దక్కడం లేదని, ఈ అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యత పాలకులదేనని చెప్పారు. బీసీ రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం భూదాన్ భూమిని పరిశీలించి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్, టీఎన్జీఓస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, పార్టీ నాయకులు చిర్రా రవి, నూనె భాస్కరరావు, స్వర్ణకుమార్, షేక్ మహబూబ్ పాషా, షేక్ ఫకృద్దీన్, పమ్మి రవి, నజీమా, సత్యనారాయణ, జగదీష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


