రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక

Mar 6 2026 8:23 AM | Updated on Mar 6 2026 8:23 AM

పాల్వంచరూరల్‌ : వన్యప్రాణి సంరక్షణకు నిరంతరం విధులు నిర్వహిస్తున్న చాతకొండ వైల్డ్‌లైఫ్‌ రేంజర్‌ పాయం కనకమ్మ, బీఎఫ్‌ఓ బి.కల్పన అంతర్జాతీయ మహిళా దినోత్సవ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారని ఎఫ్‌డీఓ బి.బాబు గురువారం తెలిపారు. చాతకొండ రేంజర్‌ కనకమ్మ 2002లో ఎఫ్‌బీఓగా ఉద్యోగంలో చేరి 2005లో సెక్షన్‌ అధికారిగా, 2010లో డీఆర్‌ఓగా, 2024లో వైల్డ్‌లైఫ్‌ డివిజన్‌ చాతకొండ రేంజర్‌గా పదోన్నతి పొందారు. ఆక్రమణకు గురైన 623 ఎకరాల అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఆమె సేవలను గుర్తించిన అటవీ శాఖ ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసిందని వివరించారు. వైల్డ్‌లైఫ్‌ డివిజన్‌ మల్లారం బీట్‌లో బీట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్య కల్పన ప్రస్తుతం లా కోరు చదువుతున్నారని, 2012లో ఏబీఓగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అంకిత భావంతో పనిచేశారని తెలిపారు. వీరిద్దరూ ఈనెల 8న హైదరాబాద్‌లో పీసీసీఎఫ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారని వెల్ల డించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement