పీఎంకేవీవైలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

పీఎంకేవీవైలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

Feb 27 2026 7:32 AM | Updated on Feb 27 2026 7:32 AM

పీఎంక

పీఎంకేవీవైలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

మణుగూరు టౌన్‌: మండలంలోని మణుగూరు ప్రభుత్వ ఐటీఐలో పీఎంకేవీవై పథకం ద్వారా ఏర్పా టు చేసిన షార్ట్‌ టర్మ్‌ కోర్సులలో ప్రవేశానికి విద్యార్థులు, యువత దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ జి.రవి తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. పీఎంకేవీవై పథకం కింద అసిస్టెంట్‌ ఎలక్ట్రిషీయన్‌, మెకానికల్‌ మెయింటెనెన్స్‌ కోర్సులలో మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండి, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని అన్నారు. మార్చి నెల నుంచి మొదటి బ్యాచ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆసక్తి,అర్హత కలిగి అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

ఇల్లెందు: విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడంతోపాటు నైతిక విలువలు పాటించాలని సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, విద్యా విభాగం జీఎం, సెక్రెటరీ ఎస్‌.వెంకటాచారి తెలిపారు. గురువారం ఇల్లెందు సింగరేణి హైస్కూల్‌ 50వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షురాలు వీసం రమా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాసరావు, డీజీఎం కరస్పాండెంట్‌ తుకారం, సిబ్బంది పీవీ నరసింహ, రవీందర్‌, శ్రీనివాస్‌, ధనలక్ష్మి పాల్గొన్నారు.

మత ప్రచారం అడ్డగింత

దమ్మపేట: దమ్మపేటలో గురువారం కొందరు పోలీసుల అనుమతితో మత ప్రచారం నిర్వహిస్తుండగా మరో మతానికి చెందిన యువకులు అడ్డుకుని హంగామా సృష్టించారు. స్థానిక వీధుల్లో గురువారం ఓ మతానికి చెందిన వారు ప్రచారం చేస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణి చేస్తున్నారు. ప్రచారం చేయడాన్ని యువకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్‌ఐ కిషోర్‌రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. చట్ట పరిధిలో తాను ప్రచారానికి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

భాషా పండితుల

పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలి

భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖలో ద్వితీయ శ్రేణి భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ఉన్నతీకరించాలని, గిరిజన సంక్షేమ పాఠశాలల, ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుటారి రాజు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట గిరిజన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్లను, డైలీ వేజ్‌ వర్కర్లను రెగ్యులరైజ్‌ చేసి, టైం స్కేళ్లను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని కోరారు. అన్ని హాస్టళ్లను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్‌ చేయాలని, కన్వర్టెడ్‌ ఆశ్రమ పాఠశాలలకు అదనపు పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.హరిలాల్‌, జె.రాంబాబు, బి.ప్రసాదరావు, కె.మాధవరెడ్డి, మునిగడప రామాచారి, ఎం.ప్రతాప్‌ సింగ్‌, బి.ప్రకాష్‌ రావు, బి.రవి బి.వీరన్న, బి.సుందర్‌, మోహన్‌ పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల

పనితీరు బాగుంది

జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి నాగరాజశేఖర్‌

అశ్వారావుపేటరూరల్‌: పట్టణంలోని చిన్నంశెట్టి బజార్‌లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ జిల్లా మానిటరింగ్‌ అధికారి అమృతలూరి నాగరాజశేఖర్‌ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థుల సామర్థ్యాలు, వర్క్‌, నోట్‌ పుస్తకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు సమర్థవంతంగా పని చేస్తున్నారని, గ్రంథాలయ నిర్వహణ తీరు కూడా బాగుందని అభినందించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ రిసోర్స్‌ పర్సన్‌ శ్రీశైలం, కార్తీక్‌, ఉపాధ్యాయులు బాబూరావు, కావ్య పాల్గొన్నారు.

పీఎంకేవీవైలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి1
1/2

పీఎంకేవీవైలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

పీఎంకేవీవైలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి2
2/2

పీఎంకేవీవైలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement