పేదల ఇళ్లు కూల్చడం అన్యాయం
ఖమ్మంఅర్బన్: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. కూల్చివేతలు జరిగిన ప్రదేశాన్ని శనివారం సాయంత్రం పరిశీలించగా.. బాధితులు తమ సమస్యను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఏళ్లుగా ఇక్కడే తాత్కాలిక నివాసా లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ ఇళ్లు కట్టుకున్నామని తెలిపారు. ఇప్పుడు కూల్చివేతతో రోడ్డున పడ్డామన్నారు. అనంతరం విమలక్క మా ట్లాడుతూ.. భూదాన్ భూముల్లో పేదలు ఇళ్లు కట్టుకుంటే పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం కూల్చి వేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పేదలకు ఒక నీతి, పెద్దలకు మరో నీతి అమలు చేయడం సరైంది కాదన్నారు. పాలకులు మారినా పేదల పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. బాధితులకు భూదాన్ భూముల్లోనే నివాసాలు ఏర్పాటు చేసేంత వరకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున అండగా నిలిచి పోరాడుతామని పేర్కొన్నారు. అనంతరం అంబేడ్కర్‌భవన్ పునరావాస కేంద్రంలో ఉంటున్న వారిని సైతం విమలక్క పరామర్శించారు. కార్యక్రమంలో స్పర్శ భాస్కర్, న్యాయవాది మేకల సుగుణారావు, అరుణోదయ మల్సూర్, కొమ్ము రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అరుణోదయ సాంస్కృతిక అధ్యక్షురాలు
విమలక్క


