క్రీడాభివృద్ధిలో చెరగని ముద్ర | - | Sakshi
Sakshi News home page

క్రీడాభివృద్ధిలో చెరగని ముద్ర

Feb 28 2026 7:26 AM | Updated on Feb 28 2026 7:26 AM

క్రీడ

క్రీడాభివృద్ధిలో చెరగని ముద్ర

క్రీడాకారులకు వెన్నుదన్నుగా..

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా క్రీడారంగ అభివృద్ధిలో కలెక్టర్‌గా జితేష్‌ వి.పాటిల్‌ చెరగని ముద్ర వేశారు. క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రోత్సాహం కల్పించారు. నిరుపయోగంగా ఉన్న పాల్వంచ మినీ స్టేడియాన్ని వినియోగంలోకి తెచ్చి, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. ఇల్లెందులో స్టేడియం నిర్మాణ పనులకు అదనంగా రూ.1.5 కోట్లు కేటాయించారు. కొత్తగూడెంలో రైఫిల్‌ షూటింగ్‌ సెంటర్‌, బాక్సింగ్‌ రింగ్‌, తైక్వాండో మ్యాట్స్‌ ఏర్పాటుకు చొరవ చూపారు. గిరిజన విద్యార్థుల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించి స్పోర్ట్స్‌ సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు 15 టేబుల్‌ టెన్నిస్‌ బోర్డులు, కబడ్డీ క్రీడకు మూడు సెట్ల మ్యాట్‌లు సమకూర్చారు. ఫుట్‌బాల్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసి క్రీడా సామగ్రిని అందజేశారు. ఎన్జీఓ హైఫై ఫౌండేషన్‌ సహకారంతో నవభారత్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో బాస్కెట్‌బాల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. శ్రీరామచంద్ర గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో హాక్రీ మైదానం ఏర్పాటుకు తోడ్పాటునందించారు. డీఎంఎఫ్‌టీ నిధులు రూ. 71 లక్షలతో క్రీడా సామగ్రి కొనుగోలు చేశారు. రూ. 5కోట్లను అశ్వారావుపేట మినీ స్టేడియానికి కేటాయించారు. క్రీడా కోర్సు ఫీజులను చెల్లించడంతోపాటు ఆర్చరీ, సైక్లింగ్‌, సాఫ్ట్‌బాల్‌ తదితర క్రీడల కోసం అంతర్జాతీయ స్థాయి పరికరాలను తెప్పించారు.

కలెక్టర్‌గా పనిచేసిన జితేష్‌ వి.పాటిల్‌ క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. క్రీడా శాఖలో గణనీయమైన మార్పులు తెచ్చారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపి వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన బదిలీ కావడంతో జిల్లా క్రీడాకారులు, క్రీడా సంఘాల బాధ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. నూతన శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చొరవ చూపారు. కలెక్టర్‌ ప్రోత్సాహంతోనే జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ చూపి సీఎం కప్‌లో ఒకేసారి 54 పతకాలు సాధించారు.

–పరంధామరెడ్డి, జిల్లా యువజన,

క్రీడల శాఖ అధికారి

కలెక్టర్‌గా క్రీడాకారులకు

తోడ్పాటునందించిన జితేష్‌ వి.పాటిల్‌

క్రీడాభివృద్ధిలో చెరగని ముద్ర1
1/1

క్రీడాభివృద్ధిలో చెరగని ముద్ర

Advertisement
 
Advertisement
Advertisement