సూపర్‌బజార్(కొత్తగూడెం): సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఈనెల 8న కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం బంజారా సంఘాలు. వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జయంతి వేడుకల నిర్వహణకు తొమ్మిది కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కన్వీనర్‌గా రమేష్ రాథోడ్. కో కన్వీనర్‌గా మాజీ కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ నాయక్ వ్యవహరిస్తారని చెప్పారు. ఈ మేరకు కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్యతో సమావేశం నిర్వహించి వేడుకల వివరాలు తెలియజేశారు. ఆ తర్వాత వేడుకలు నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు.


