‘ప్రజాపాలన’లో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రజాపాలన’లో భాగస్వాములు కావాలి

Mar 7 2026 8:09 AM | Updated on Mar 7 2026 8:09 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన పనులను సమగ్ర ప్రణాళికతో అమలు చేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, పెండింగ్‌ ఫైళ్ల పరిష్కారం, వైద్య ఆరోగ్య సేవల విస్తరణ, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు, అరైవ్‌ అలైవ్‌ రోడ్డు భద్రత తదితర కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని వివరించారు. కోతులు, వీధి కుక్కల సమస్యలను నియంత్రించాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ టాక్స్‌ వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. యూరియా సమర్థ వినియోగం, బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, లింకేజీ రుణాల మంజూరు కార్యక్రమాలను, 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని అన్నారు.

జూలూరుపాడు: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జూలూరుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్‌ అంకిత్‌ సందర్శించారు. కార్యాలయం లోపల, పరిసరాలను పరిశీలించారు. 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ షెడ్యూల్‌ ప్రకారం చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అధికారులు టి.శ్రీనివాస్‌, అజయ్‌, తులిసీరామ్‌, ఖాదర్‌మియా పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement