టేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గోనెల విజయలక్ష్మి అంత్యక్రియలను ఆమె స్వగ్రామం టేకులపల్లి మండలం తెలుగూరులో శుక్రవారం నిర్వహించారు. గుండెపోటుతో గురువారం ఆమె మృతిచెందగా మృతదేహాన్ని స్వ గ్రామానికి తీసుకొచ్చారు. తన రాజకీయ గురువైన వెంకటనారాయణ సతీమణి మృతదేహం వద్ద ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాక పాడె మోసి అంత్యక్రయల్లో పాల్గొన్నారు. అలాగే, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, నాయకులు కోరం లక్ష్మి, కోరం సురేందర్, ఉమ, కోరం హన్మంతు, వెంకన్న, నర్సింగ్ లక్ష్మయ్య, కాలె ప్రసాద్, బండ్ల రజిని, శ్రీనివాస్, ఈది గణేశ్, జానీ తదితరులు నివాళులర్పించారు.


