‘కొత్తగూడెం–పాల్వంచ’ కార్పొరేషన్‌గా మార్చాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పేరును కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ఇటీవల కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. కార్పొరేషన్‌కు కొత్తగూడెం పేరు మాత్రమే ఉందని, పాల్వంచ పేరు చేర్చాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వారి మనోభావాలను గౌరవిస్తూ పేరు మార్చాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పేరు మార్పు కోసం తక్షణమే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని లేఖ


