ఎన్‌ఎంఎంఎస్‌కు నాగుపల్లి విద్యార్థుల ఎంపిక
దమ్మపేట: మండల పరిధిలోని నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్)కు అర్హత సాధించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న కందిమళ్ల శ్రీవిద్య, పగడాల నవదుర్గాప్రసాద్, నల్లబోతుల హాసిని గతేడాది నవంబరులో జరిగిన ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. వీరికి సంవత్సరానికి రూ. 12,000 చొప్పున 12వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికం సాయం అందిస్తుందని హెచ్‌ఎం బజ్జూరి సరళ తెలిపారు.


