పతకాల వేటలో తహసీల్దార్
ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియంలో సాధన..
● ఓవైపు విధి నిర్వహణ.. మరోవైపు పరుగు ప్రాక్టీస్ ● జాతీయస్థాయిలో 23 పతకాలు
పాల్వంచరూరల్: అంకుఠిత దీక్ష, పట్టుదలతో ఒకవైపు తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు రన్నింగ్‌ను ప్రాక్టిస్ చేస్తూ పోటీల్లో పాల్గొని పఽతకాలను గెలుచుకుంటున్నారు. సమాజంలో గుర్తింపునకు ఉద్యోగం ముఖ్యం కాదని.. ఆటలతోనూ తమ ప్రతిభను నిరూపించుకోవచ్చనే సంకల్పంతో పయనిస్తున్నారు పాల్వంచ తహసీల్దార్ దారా ప్రసాద్. వీలున్నప్పుడల్లా రాష్ట్ర, జాతీయస్థాయి మార్తన్(పరుగు పందెం) పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 22 పతకాలను గెలుచుకున్నారు.
ఇప్పటివరకు సాధించిన పతకాలు..
● 2024లో సిద్దిపేట, కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీల్లో విజయం సాధించి రెండు పతకాలు సాధించారు.
● 2025లో ఎన్‌ఎండీసీ ఆధ్వర్యాన నిర్వహించిన అంతర్జాతీయస్థాయి మార్తన్ పరుగు పందెం పోటీల్లో పాల్గొని 42 కిలోమీటర్లు దూరాన్ని 6.30 గంటల్లో పూర్తిచేయాల్సి ఉండగా.. తహసీల్దార్ కేవలం 5.25 గంటల వ్యవధిలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి పతకాన్ని కేవసం చేసుకున్నారు.
● ముంబైలో జనవరిలో జరిగిన పోటీల్లో పాల్గొని 42 కిలోమీటర్ల దూరాన్ని 4.13 గంటల సమయంలోనే లక్ష్యాన్ని సాధించారు.
● గతేడాది అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగిన అల్ఫామార్తన్ పోటీల్లో పాల్గొని 21 కిలోమీటర్ల పరుగును 2.16 గంటల సమయంలోనే పూర్తి చేసి పతకాన్ని కై వసం చేసుకున్నారు.
● కోల్‌కత్తాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 25 కిలోమీటర్ల నిర్ధేశించిన సమయంలోపు చేరుకుని పతకాన్ని గెలుచుకున్నారు. జనవరి 18న ముంబైలో జరిగిన పోటీలో పాల్గొని పతకాన్ని సాధించారు.
ఒక వైపు విఽధినిర్వహణతో పాటు ప్రతీ రోజు వేకువ జామున సర్దార్‌పటేల్ స్టేడియంలో క్లబ్ మిత్రులతో కలిసి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తా. విధినిర్వహణలో ఒత్తిడిని అధికమించేందుకు వాకింగ్, రన్నింగ్ చేస్తా. వచ్చే నెల ముంబైలో జాతీయస్థాయి మార్తన్ పోటీల్లో పాల్గొనేందుకు సాధన చేస్తున్నా.
– దారాప్రసాద్, తహసీల్దార్, పాల్వంచ


