భద్రాచలంటౌన్: ఐటీడీఏ పరిధిలోని మోడల్ క్రీడా పాఠశాలల్లో 2026 – 27 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన బ్రోచర్‌ను పీఓ బి.రాహుల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిన్నెరసాని (బాలురు), కాచనపల్లి (బాలికలు) పాఠశాలల్లో 40 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 9 నుంచి 11 ఏళ్ల లోపు వయసు ఉండి, ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికై న వారికి ఉచిత వసతి, పౌష్టికాహారం, స్పోర్ట్స్ కిట్లతో పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీడీ అశోక్, క్రీడల అధికారి గోపాలరావు పాల్గొన్నారు.
ఎల్‌ఎల్‌బీ సీటు సాధించడం అభినందనీయం..
టేకులపల్లి మండలం సంపత్‌నగర్‌కు చెందిన నిరుపేద ఆదివాసీ యువకుడు పూనెం హరీష్ ప్రతిష్టాత్మక న్యూఢిల్లీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ సీటు సాధించడం అభినందనీయమని పీఓ రాహుల్ అన్నారు. ఈ మేరకు ఐటీడీఏ తరఫున ప్రోత్సాహకంగా రూ.30వేల చెక్కును బుధవారం తన చాంబర్‌లో విద్యార్థి తండ్రి లక్ష్మయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జాతీయ స్థాయి వర్సిటీలో సీటు సాధించిన హరీష్ తోటి విద్యార్థులకు ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


